Sircilla: సిరిసిల్లలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సన్నాహాలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం విజయవంతం చేయడానికి వైద్యాధికారులకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ శిక్షణ ఇచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 9 July 2026 5:23 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సన్నాహాలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రభుత్వ వైద్యాధికారులు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ.. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలబాలికకు అల్బెండాజోల్ మాత్రలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమం రోజున మాత్రలు తీసుకోలేని పిల్లలకు జూలై 20న మాప్-అప్ డే నిర్వహించి తప్పనిసరిగా మందులు అందించాలని ఆదేశించారు.

వయస్సుకు అనుగుణంగా మాత్రల మోతాదు ఇవ్వాలని, అల్బెండాజోల్ మాత్రలను పిల్లలకు ఇంటికి పంపకుండా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు లేదా నిర్దేశిత కేంద్రాల్లోనే పర్యవేక్షణలో వేయాలని స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు ముందుగానే అవగాహన కల్పించి, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

శిక్షణ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ నాగేంద్ర బాబు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story