Karimnagar: నీట్ పేపర్ లీకేజీపై కరీంనగర్‌లో కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నిరసన

Karimnagar: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఫలితాల అవకతవకలపై కరీంనగర్ లో కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 12 Jun 2026 7:59 PM IST
Karimnagar
X

Karimnagar: నీట్ పేపర్ లీకేజీపై కరీంనగర్‌లో కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నిరసన

కరీంనగర్: దేశవ్యాప్తంగా నీటి పరీక్ష పేపర్ లీకేజీ పై కాంగ్రెస్ ఎన్ఎస్ఐ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్ ఎస్ యు ఐ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తెలంగాణ చౌక్ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..

NEET ఫలితాలలో అవకతవకలు, CBSE, JEE ADVANCE పేపర్ లీకేజీ ల పై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా తప్పును సమర్ధించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.

తక్షణమే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి మరొక మారు పేపరు లీకేజీ కాకుండా చర్యలు చేపట్టి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి వారికి మరొక అమారు అవకాశం ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలను బాగు చేసే విధంగా కఠిన చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.

తప్పును సమర్ధించుకునే పని మాని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఏ పరీక్ష నిర్వహించిన లీకేజీలు చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తక్షణమే విద్యాశాఖ మంత్రిని తొలగించి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story