jagtial: కొండగట్టు జేఎన్‌టీయూ కళాశాలలో ప్రారంభమైన ‘నీట్’ పరీక్ష

jagtial: జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో నీట్ (NEET UG) పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 21 Jun 2026 3:06 PM IST
jagtial
X

jagtial: కొండగట్టు జేఎన్‌టీయూ కళాశాలలో ప్రారంభమైన ‘నీట్’ పరీక్ష

జగిత్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్‌టీయూ కళాశాలలో నిర్వహించిన నీట్ పరీక్ష కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాయడానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించే ముందు అభ్యర్థుల హాల్ టికెట్లు, గుర్తింపు కార్డులను సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు.

పరీక్ష నిబంధనల ప్రకారం నిషేధిత వస్తువులు తీసుకురాకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అనంతరం విద్యార్థులను పరీక్షా హాళ్లలోకి పంపించారు. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భద్రతా సిబ్బందిని మోహరించి, కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story