Karimnagar: నీట్ పేపర్ లీక్.. కరీంనగర్‌లో బీఆర్ఎస్‌వీ నిరసన

Karimnagar: నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా కరీంనగర్‌లో BRSV ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 13 May 2026 2:27 PM IST
Karimnagar
X

Karimnagar: నీట్ పేపర్ లీక్.. కరీంనగర్‌లో బీఆర్ఎస్‌వీ నిరసన

Karimnagar: నీట్ పరీక్ష రద్దుకు నిరసనగా BRSV ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం, అడ్డుకున్న పోలీస్ లు పోరాటం చేసి దహనం చేసిన విద్యార్థి నాయకులు. నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీకి మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ, నీట్ పరీక్ష రద్దుకు నిరసనగా బీఆర్ఎస్‌వీ జిల్లా మాజీ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ సర్కార్ అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. పేపర్ లీకేజీ ల ద్వారా ఇప్పటి వరకు 53 లక్షల పై చిలుకు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడింది అని చెప్పారు. ఇలా పేపర్ లీకేజీ జరిగితే దోషులకు దారుణమైన శిక్షలను విధించేలా ప్రత్యేక చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు.

పరీక్ష నిర్వహణలో 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' (NTA) ఘోరంగా విఫలమైంది. పగలు రాత్రి కష్టపడి చదివిన విద్యార్థులకు మోదీ ప్రభుత్వం ఇచ్చే బహుమతి పేపర్ లీకేజీలా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి అని ఎద్దేవా చేశారు. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి, వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించడం లేదు.

నైతిక బాధ్యత వహిస్తూ NTA డైరెక్టర్ జనరల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సిగ్గుచేటు. లీకు వీరులను కఠినంగా శిక్షించాలి, ఇక ముందు ఇలా జరుగకుండా వీరికి ఉరిశిక్ష విధించాలి ,అకడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా వెంటనే పకడ్బందీగా పరీక్షా తేదీలను ప్రకటించాలని కోరారు.

ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ శాతవాహన యూనివర్సిటీ BRSV ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, నగర BRSV అధ్యక్షులు బొంకూరి మోహన్, నారదాసు వసంత్ రావు, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, వడ్లకొండ పరుశరామ్, అన్వేష్, సోహెల్, క్రాంతి, శ్రవణ్, రవి గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story