Karimnagar: నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Karimnagar: కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధం. ఈ నెలాఖరున ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 11 Jun 2026 4:28 PM IST
Karimnagar
X

Karimnagar: నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్: ఈ నెలాఖరు లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేత ప్రారంభం కానున్న కరీంనగర్ కలెక్టరేట్ నూతన భవనం పనులు పూర్తి కావడంతో అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవనానికి గతంలో నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ చాలా పనులు మిగిలిపోయి పరిస్థితి ఉండే జిల్లా కలెక్టర్ గా చిత్ర మిశ్రా బాధ్యతలు స్వీకరించిన తరువాత భవన నిర్మాణం పై ప్రత్యేక శ్రద్ధ చేపట్టారు అని అన్నారు. మిగిలిపోయిన పనులు పై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.

నెల చివర వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టరేట్ ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, జాతీయ జెండా ఆవిష్కరిస్తారన్నారు.

భవనం ప్రారంభం తర్వాత జిల్లా కేంద్రంలో ఉన్న సమీకృత కార్యాలయాలు ఇతర భవనాలు కూడా ఇక్కడే ఉపయోగించడం జరుగుతుందని అన్నారు.

పాత భవనానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించి దానిని కూడా ఇతర కార్యాలయాలకు ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. కలెక్టరేట్ కట్టే సమయంలో జిల్లా అధికారులకు ప్రత్యేకించి నివాస గృహాలు కట్టే కార్యాచరణ ఉండే కానీ ఇప్పటికే గతంలో నిర్మించిన జిల్లా అధికారుల నివాస గృహాలు సరిపోతుందని బాగుంది దానిని వాడుకోవడం జరుగుతుందని చెప్పారు.

నూతన కలెక్టరేట్ కార్యాలయంలో గ్రీనరీ ,ల్యాండ్ స్కెప్ సుడా ఆధ్వర్యం లో చేయడం జరిగిందని, కరీంనగర్ కలెక్టరేట్ కి ప్రజలు రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా దారి విస్తరించడం జరుగుతుందని తెలిపారు.

కలెక్టరేట్ లో పని విధానం ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం ,200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం,గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లు,రాబోయే కాలంలో కొత్త పెన్షన్లు ,మున్సిపల్ అంశాలు పరిపాలన కేంద్రంగా రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామిగా ఉండాలని అధికారులకు సూచించారు.

రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ గడ్డ అగ్రగామిగా ఉంచుతాం.. టూరిజం , ఇండస్ట్రీ తో పాటు ఎడ్యుకేషన్ హబ్ గా శాతవాహన యూనివర్సిటీ ఉంది లా కాలేజీ ,ఫార్మసీ కాలేజీ తీసుకొచ్చాం.. గత 10 సంవత్సరాలుగా ఒక్క కొత్త కోర్సు కూడా రాలేదని అన్నారు.

హెల్త్ హబ్ గా మెడికల్ కాలేజీ ఉంది.. టీచింగ్ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయడం జరిగిందని, జిల్లా అభివృద్ధి కి నేను శ్రీధర్ బాబు ,అడ్లూరి లక్ష్మణ్ శాసన సభ్యులతో కలిసి చేస్తున్నాం అన్నారు.

హెలిప్యాడ్ గ్రౌండ్ వినియోగంలోకి తేవడం జరుగుతుందని, ముఖ్యమంత్రి ప్రోగ్రాం లో శాతవాహన యూనివర్సిటీ కాలేజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయని, మున్సిపల్ ,ఇతర శాఖల అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ మేము వచ్చిన తర్వాత నే సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతోపాటు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా,మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు ,తదితర అధికారులు ,నాయకులు సిబ్బంది పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story