Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ మత్స్య సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం గ్రామ శాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. అధ్యక్షుడిగా చెప్పాల సారయ్య బాధ్యతలు.
Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ మత్స్య సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.
మొత్తం 28 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వారిలో 18 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మిగిలిన 9 మంది పాలకమండలి సభ్యులుగా ఏకగ్రీవమయ్యారు.సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడిగా చెప్పాల సారయ్య, ఉపాధ్యక్షుడిగా చిలువేరు రమేష్, కోశాధికారిగా కొలిపాక అన్వేష్, సహాయ కార్యదర్శిగా బంగారి నవీన్ ఎన్నికయ్యారు.
డైరెక్టర్లుగా చొప్పరి నాగరాజు, ఈర్ల నరేష్, బండారి కొమురయ్య, కారుపాకుల మల్లేష్, చిట్ల కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఎస్సై గట్ల సుధాకర్ బందోబస్తు ఏర్పాటు చేశారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సర్పంచ్ బంగారి రమేష్ మరియు పలువురు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చెప్పాల సారయ్య మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మత్స్య కార్మికుల సంక్షేమానికి, సంఘ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.




