Sircilla: సిరిసిల్ల 35వ వార్డు పద్మశాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు
Sircilla: రాజన్న సిరిసిల్ల 35వ వార్డు పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా గజ్జలి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా నక్క మల్లేశం ఎన్నికయ్యారు. పట్టణ సంఘం కమిటీని ప్రకటించింది.
Sircilla: సిరిసిల్ల 35వ వార్డు పద్మశాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు
రాజన్న సిరిసిల్ల జిల్లా: పద్మశాలి సమాజ ఐక్యత, అభివృద్ధి, కులబాంధవుల సంక్షేమమే లక్ష్యంగా సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 35వ వార్డుకు నూతన కమిటీని నియమించారు.
సంఘంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పద్మశాలి కులబాంధవుడిని సభ్యుడిగా చేర్పించి సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కమిటీని ఏర్పాటు చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
నూతన కమిటీ అధ్యక్షుడిగా గజ్జలి శ్రీధర్, ఉపాధ్యక్షులుగా ఉడత రమేష్, ఆడెపు సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా నక్క మల్లేశం, కార్యదర్శులుగా రచ్చ మహేష్, గంజి వెంకటేశ్వర్లును నియమించారు.
కార్యవర్గ సభ్యులుగా గజ్జెల్లి వేణు, గడ్డం లింగం, గాజుల రాజు, అడిచర్ల రాజు, గజేంద్ర లక్ష్మణ్‌లను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు 35వ వార్డు ప్రజల సహకారంతో పద్మశాలి సమాజ ఐక్యతను పెంపొందిస్తూ, సంఘ అభివృద్ధికి, కులబాంధవుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గుంటుక పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి మాదాస్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యుడు గాజుల సదానందం తదితరులు పాల్గొన్నారు.




