Sircilla: సిరిసిల్లలో 29, 33, 38వ వార్డులకు పద్మశాలి సంఘం నూతన కమిటీలు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 29, 33, 38వ వార్డులకు అధ్యక్షులు, నూతన కార్యవర్గ కమిటీలను నియమించారు.

KALEEM, SIRICILLA
Published on: 13 Nov 2026 4:21 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో 29, 33, 38వ వార్డులకు పద్మశాలి సంఘం నూతన కమిటీలు

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వార్డు కమిటీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 29, 33, 38వ వార్డులకు నూతన కమిటీలను నియమించారు. ఆయా వార్డుల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు.

29వ వార్డు కమిటీ: అధ్యక్షుడిగా గజ్జెల్లి అశోక్, ఉపాధ్యక్షులుగా ఆడెపు కనకయ్య, బచ్చు రాజు, ప్రధాన కార్యదర్శిగా కుస్మ శ్రీనివాస్, కార్యదర్శులుగా వేముల శ్రీధర్, గజ్జెల్లి వినయ్ నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పత్తిపాక నవీన్, మోర రమేష్, కోడం లక్ష్మణ్ ఎంపికయ్యారు.

33వ వార్డు కమిటీ: అధ్యక్షుడిగా రాజుల విద్యాసాగర్, ఉపాధ్యక్షులుగా ఎల్గం అభిలాష్, బొడ్డు భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా సిరిసిల్ల సాయి కృష్ణ, కార్యదర్శులుగా ముడం అశోక్, బోద్దుల సుభాష్ నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా యెలగొండ కేదారి, గాజుల ఉమాపతి, దూస శంకర్, సిరిసిల్ల శ్యామ్, ఎలిగేటి శ్రీనివాస్ ఎంపికయ్యారు.

38వ వార్డు కమిటీ: అధ్యక్షుడిగా నల్ల దక్షిణామూర్తి, ఉపాధ్యక్షులుగా సిరిసిల్ల రామస్వామి, ఈగ రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా మూశం రాజయ్య, కార్యదర్శులుగా గున్నాల ఇస్తారి, వడ్లకొండ దేవదాస్ నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా వంగ లక్ష్మీనారాయణ, రిక్కిమల్లె ప్రకాష్, గోసికొండ సనకసనందం, గుజ్జే దత్తు, వాసం రాజు, లగిశెట్టి రాములు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా నూతన కమిటీల నియామకం పద్మశాలి సమాజ ఐక్యతకు, సంఘటిత శక్తికి మరింత బలాన్ని చేకూరుస్తుందని పట్టణ పద్మశాలి సంఘం ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని అభివృద్ధి, సంక్షేమం, ఐక్యత కోసం నూతన కమిటీలు సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి పద్మశాలిని పట్టణ పద్మశాలి సంఘంలో సభ్యులుగా చేర్చి, సంఘాన్ని మరింత బలోపేతం చేయడంలో వార్డు కమిటీలు కీలక పాత్ర పోషించాలని కోరారు.

ఐక్యతే బలం, సమాజ అభివృద్ధే లక్ష్యం, పద్మశాలీల సంక్షేమమే ధ్యేయంగా నూతన కమిటీలు పనిచేయాలని పిలుపునిస్తూ, మూడు వార్డుల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు పట్టణ పద్మశాలి సంఘం తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA