Sircilla: ఇల్లంతకుంటలో నూతన యాదవ సంఘం కార్యవర్గానికి ఘన సన్మానం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని సోమరం పేట, అనంతగిరి గ్రామాల్లో నూతన యాదవ సంఘం కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం.

KALEEM, SIRICILLA
Published on: 10 Oct 2026 5:40 PM IST
Sircilla
X

Sircilla: ఇల్లంతకుంటలో నూతన యాదవ సంఘం కార్యవర్గానికి ఘన సన్మానం!

Sircilla: మండలంలోని సోమరం పేట, అనంతగిరి గ్రామ యాదవ సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన శ్రీకృష్ణ గోపాల మండల యాదవ సంఘం కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఓరుపుల రాములు మాట్లాడుతూ గ్రామాల్లో యాదవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని తెలిపారు. యాదవ సంఘాలను బలోపేతం చేయాలని, మండలంలోని అన్ని గ్రామాల యాదవ బంధువులు ఐక్యతతో, కలిసికట్టుగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బాలరాజు, కార్యదర్శి అజయ్, కోశాధికారి రాజశేఖర్, జొర్ర రాజయ్య పాల్గొన్నారు. సోమరం పేట గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు పలమారు కుంటయ్య, ఉపాధ్యక్షుడు సంకటి మల్లయ్య, కార్యదర్శులు వంగ తిరుపతి, పూజారి ఓజయ్యతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

అనంతగిరి గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు, సర్పంచ్ అరుకాల నవీన్ యాదవ్, ఉపాధ్యక్షుడు మీసం శ్రీనివాస్ యాదవ్, యార మల్లయ్య, అరుకాల కొమురయ్య, ఎలుకపెల్లి మల్లయ్య, యార శ్రీనివాస్, తూముల మల్లేశం, యార ఎల్లయ్య, నూనె మల్లయ్య, యార అంజయ్య, యార కుమారస్వామి, యార కృష్ణ, యారా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA