Peddapalli: రాజీనామా లేదిక.. చాంబర్ అధ్యక్షుడిగా కొనసాగుతా: కమల్ కిషోర్ శారద!

Peddapalli: కమిటీ సభ్యుల ఆమోదంతో తన రాజీనామా ఆలోచనను వెనక్కి తీసుకుని పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కొనసాగుతానని కమల్ కిషోర్ శారద బుధవారం తెలిపారు.

RAJU, PEDDAPALLI
Published on: 25 Nov 2026 7:32 PM IST
Peddapalli
X

Peddapalli: రాజీనామా లేదిక.. చాంబర్ అధ్యక్షుడిగా కొనసాగుతా: కమల్ కిషోర్ శారద!

పెద్దపల్లి: పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కమల్ కిషోర్ శారద తన రాజీనామా ఆలోచనను వెనక్కి తీసుకున్నారు. కమిటీ సభ్యుల ఆమోదంతో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా తానే కొనసాగుతానని ప్రకటించారు.

బుధవారం పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొందరపాటు నిర్ణయంతో రాజీనామా చేయాలనే ఆలోచనకు వచ్చినప్పటికీ, కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో తొందరపాటుతో వ్యవహరించి అధికారులకు ఏవైనా ఇబ్బందులు కలిగించి ఉంటే పెద్దమనసుతో క్షమించాలని కోరారు. పట్టణ అభివృద్ధికి చాంబర్ ఆఫ్ కామర్స్ ఎల్లప్పుడూ సహకరిస్తుందని స్పష్టం చేశారు.

అధికారులకు ఇబ్బందులు కలిగించకుండా, వారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పరస్పర సమన్వయంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ సయ్యద్ మస్రత్‌తో పాటు కమిటీ సభ్యులు కొమురవెల్లి జయప్రకాష్, మాండలి వినోద్, ఉనుకొండ ప్రకాష్, గంగుల రవి, దివా రాయ్, సంతోష్, శ్రీ వి.ఎస్. స్వామి, మహేందర్, శంకర్, వీరయ్య, వర్మ, భవతి మల్లేశం, జక్కే శ్రీనివాస్ (హైటెక్) తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI