Sircilla: రాజన్న సిరిసిల్ల ఎరువుల కొరత లేదు కలెక్టర్ గరిమ అగ్రవాల్!
Sircilla : పంటల సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు విక్రయించాలని అధికారులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
Sircilla: రాజన్న సిరిసిల్ల ఎరువుల కొరత లేదు కలెక్టర్ గరిమ అగ్రవాల్!
Sircilla: జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఎరువుల సరఫరా, నిల్వ, విక్రయాలు తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో పాటు మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, సహకార, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ అధికారులతో ఎరువుల లభ్యతపై చర్చించారు.
జిల్లాలో పంటల సాగుకు అనుగుణంగా అవసరమైన అన్ని రకాల ఎరువులను ఇక్కడే నిల్వ చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు ఎరువులను విక్రయించాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ అధికారులు తమ పరిధిలోని అన్ని ఎరువుల దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, ఎరువుల నిల్వలు, విక్రయ ధరలను పరిశీలించాలని సూచించారు.
సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, జిల్లా సహకార శాఖ అధికారి రామకృష్ణ, మార్క్‌ఫెడ్ డీఎం హబీబ్ తదితరులు పాల్గొన్నారు.




