Sircilla: నూలు పౌర్ణమి వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్కు ఆహ్వానం!
Sircilla: నూలు పౌర్ణమి వేడుకలు, మార్కండేయ స్వామి శోభాయాత్రకు హాజరుకావాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణిని పద్మశాలి సంఘం ఆహ్వానించింది.
Sircilla: నూలు పౌర్ణమి వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్కు ఆహ్వానం!
సిరిసిల్ల: నూలు పౌర్ణమి సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించనున్న ఉత్సవాలకు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణిని పద్మశాలి సంఘం నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్ ఆహ్వాన పత్రికను అందజేశారు.
రేపు నిర్వహించనున్న నూలు పౌర్ణమి ఉత్సవాలతో పాటు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, మోర రవి, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, యువజన విభాగం అధ్యక్షులు సబ్బని హరీష్, ఉపాధ్యక్షులు గోరిట్యాల నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి వేముల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




