Sircilla: రూ.1.50 లక్షలతో పాఠశాలలో బోర్వెల్ ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ విట్టల్

Sircilla: సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నీటి కొరత తీర్చేందుకు రూ.1.50 లక్షలతో బోర్వెల్, మోటార్‌ను ఎన్ఆర్ఐ డాక్టర్ కుసుమ విట్టల్ వితరణగా అందజేశారు.

KALEEM, SIRICILLA
Published on: 5 Sept 2026 8:19 PM IST
Sircilla
X

Sircilla: రూ.1.50 లక్షలతో పాఠశాలలో బోర్వెల్ ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ విట్టల్

సిరిసిల్ల: తాను విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా పూర్వ విద్యార్థి, ప్రవాస భారతీయుడు డాక్టర్ కుసుమ విట్టల్ దాతృత్వం చాటుకున్నారు. తన తండ్రి కీర్తిశేషులు కుసుమ రామయ్య జ్ఞాపకార్థం సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బోర్వెల్, మోటార్‌ను వితరణగా అందించారు.

పాఠశాలలో నీటి కొరతను తీర్చేందుకు బోర్వెల్ ఏర్పాటు, మోటార్ బిగించేందుకు డాక్టర్ కుసుమ విట్టల్ రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందించారు. శనివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బోర్వెల్‌కు మోటార్‌ను బిగించి, డాక్టర్ కుసుమ విట్టల్, స్థానిక కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్ తదితరులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలకు సహాయం చేయడం ద్వారా డాక్టర్ కుసుమ విట్టల్ సామాజిక సేవలో ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

డాక్టర్ కుసుమ విట్టల్ మాట్లాడుతూ సిరిసిల్లపై ఉన్న మమకారంతో ఇక్కడి ప్రభుత్వ విద్యాసంస్థలకు తమవంతు సహాయం చేయాలన్నదే తమ సంకల్పమని తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు భైరి రవీందర్ మాట్లాడుతూ పాఠశాలలో నీటి కొరత, బోర్వెల్ అవసరాన్ని తెలియజేయగానే స్పందించి వెంటనే రూ.1.50 లక్షల సహాయం అందించిన డాక్టర్ కుసుమ విట్టల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో ఉంటూ స్వస్థలంలోని ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతి కల్పించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో కుసుమ శ్రీధర్, అమెరికాలో ఆర్థో డాక్టర్ కుసుమ శరత్, రిటైర్డ్ ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం మ్యాన ఆంజనేయులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్, గాజుల ప్రతాప్, మల్లారపు పురుషోత్తము, సైకాలజిస్ట్ కె. పున్నంచందర్, మోర దామోదర్, కోడం శ్రీనివాస్, మహమ్మద్ రియాజ్, అంకారపు జ్ఞానోబా, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story