Ramagundam: 49వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ప్రత్యేక కథనం!
Ramagundam: దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులు పంచుతున్న రామగుండం ఎన్టీపీసీ 48 ఏళ్లు పూర్తి చేసుకుని 49వ ఆవిర్భావ దినోత్సవ (Raising Day) వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది.
Ramagundam: 49వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ప్రత్యేక కథనం!
Ramagundam: ఎన్టిపిసి లిమిటెడ్ భారతదేశపు అతిపెద్ద సమీకృత విద్యుత్ సంస్థ. ఇది ఐదు దశాబ్దాలకు పైగా స్వచ్ఛమైన, నమ్మకమైన ఇంధనంతో దేశ వృద్ధికి చోదకశక్తిగా నిలుస్తోంది.
1975లో స్థాపించబడిన ఎన్టిపిసి, ఒక థర్మల్ విద్యుత్ ఉత్పాదక సంస్థ నుండి సంప్రదాయ మరియు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు తవ్వకం, విద్యుత్ వాణిజ్యం, ఇ-మొబిలిటీ మరియు గ్రీన్ హైడ్రోజన్ వంటి మొత్తం విలువ గొలుసులో తన ఉనికిని చాటుకుంటూ, ఒక వైవిధ్యభరితమైన ప్రధాన ఇంధన సంస్థగా పరిణామం చెందింది.
దాదాపు 91 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో, ఎన్టిపిసి భారతదేశంలోని ప్రతి నాలుగవ లైట్‌కు విద్యుత్ అందిస్తూ, దేశ స్వచ్ఛ ఇంధన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తోంది. ఈ సంస్థ సుస్థిర భవిష్యత్తు దిశగా ముందంజలో ఉంది. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని, అణు విద్యుత్, బ్యాటరీ ఇంధన నిల్వ, కార్బన్ క్యాప్చర్ మరియు గ్రీన్ కెమికల్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులు పెడుతోంది.
మా ఉద్యోగులే మా అతిపెద్ద బలం, వారి అంకితభావం మరియు కృషి మా విజయం వైపు నడిపిస్తున్నాయి. అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, విభిన్నమైన మరియు సహకారంతో కూడిన కార్యస్థలాన్ని కొనసాగిస్తున్నాయి.
భారతదేశ వేగవంతమైన ఆర్థిక వృద్ధికి తోడ్పడే ఒక పటిష్టమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కట్టుబడి కొనసాగుతుంది . ప్రజలను కేంద్రంగా, సుస్థిరతను హృదయంగా చేసుకుని, ఎన్టిపిసి బాధ్యతాయుతంగా మరియు అవిశ్రాంతంగా
ఐదు దశాబ్దాలుగా, NTPC ప్రాజెక్టుల చుట్టూ ఉన్న కమ్యూనిటీలలో నివసిస్తున్న ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మరియు వారికి సాధికారత కల్పించడానికి అంకితమై ఉంది.
దేశ ఆర్థిక అభివృద్ధికి ముఖ్య భూమిక పోషిస్తున్న తెలంగాణ రాష్ట్రాలకు రామగుండం కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులు పంచుతున్న కేంద్ర ప్రభుత్వం సంస్థ వెలుగుల దివ్య ఎన్ టి వి సి రామగుండం ప్లాంట్ ఆవిర్భావం నుంచి నేటికీ 49 వసంతంలోకి అడుగులేస్తుంది.
1978 నవంబర్ 14న శంకుస్థాపనతో బొగ్గు ఆధారిత విద్యుత్తు రంగంలో వెలుగులను దేశంలోనే ప్రథమ స్థానం ప్రాజెక్టుగా నిలిచింది. మహారత్న కంపెనీ బిరుదు అందుకున్న రామగుండం ఎన్టీపీసీ ప్రస్థానం దక్షిణాది వెలుగులను అందిస్తూ 48 ఏళ్ళు పూర్తిచేసుకుంది .
1978 నవంబర్ 14 నాటి భారత ప్రధాని దివ్యాంగత మొరాజీ దేశాయ్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. మొదటి దశగా స్టేజ్ -1 లో భాగంగా 200 మెగావాట్లు చొప్పున 3 యూనిట్లతో మొదలుకొని ,,1983 సంవత్సరంలో స్టేజ్ -2 లో 500 మెగావాట్ల మూడు యూనిట్ల తో , 2004 సంవత్సరంలో స్టేజ్ 3 కింద మరో 500 మొత్తం 7 యూనిట్లలో 2600 మెగావాట్ల సామర్థ్యాన్ని విస్తరించింది.
బొగ్గు వినియోగం స్థానిక సింగరేణి బొగ్గు గనుల నుంచి రోజుకు 40 వేల మెట్రిక్ టన్నుల , తోపాటు ఒడిస్సా లోని మహానది కోల్‌ఫీల్డ్ నుంచి 8 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును ఒప్పందం తో ప్రాజెక్టుకు నిత్యం బొగ్గు దిగుమతుల తో కొనసాగింది. ప్రాజెక్టుకు సంబంధించిన నీటి అవసరాలకు 6.5 టిఎంసి నీరు స్థానిక ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎన్టిపిసి రిజర్వాయర్ సరఫరాతో రామగుండం ఎన్టీపీసీ లో విద్యుత్ వెలుగులు అందిస్తూ వచ్చింది.
2600 మెగావాట్ల వెలుగులు అందిస్తూ దేశంలోనే ప్రధమంగా ఐఎస్ఓ 14001 సర్టిఫికెట్ పొందిన ఏకైక ప్రాజెక్ట్ నిలిచింది. ఇదే క్రమంలో రామగుండం ఎన్టిపిసి పది మెగావాట్ల సౌరశక్తి ప్లాంట్ తో పాటు 100 మెగావాట్ల రిజర్వాయర్ పై ఫ్లూటింగ్ సోలార్ ప్లాంట్ ని ఏషియాలోనే మొదటి ప్లాంట్ గా పేరు దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు కేటాయించిన నాలుగు వేల మెగావాట్ల థర్మల్ పవర్ కేంద్రాన్ని తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2016 లో విద్యుత్ స్టేజి వన్ లో భాగంగా 2* 800 మెగా వాట్స్ ...1600 మెగావాట్ల 10,598 కోట్ల వ్యయంతో 2023-24 మార్చ్ లో పూర్తిచేసుకుని ముందుకు కొనసాగుతుంది. పేస్ 2 లో భాగంగా 3*800 మెగావాట్లు అనగా 2400 మెగావాట్ల 29,344 కోట్ల అంచనా వ్యయం రూపొందించి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
రామగుండం ఎన్టిపిసిలో వెలువడే కార్బన్ ఇబ్బందులు తగ్గించేందుకు ఎఫ్ జి డి(ఫ్యూయల్ గ్యాస్ డిసల్ఫరైజేషన్) నెలకొల్పనున్నారు. పర్యావరణ పరిరక్షణ నిర్వా రణలో 275 మీటర్ల చిమ్ని గ్యాస్ డి సల్ఫరైజేషన్ సిస్టం ఏర్పాటు చేశారు. అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో బొగ్గు వినియోగం తగ్గుతుందని, దీనితో తక్కువ కాలుష్యం వెలువడుతుందని తెలియజేశారు.
దేశవ్యాప్తంగా ఎన్టిపిసి కార్పొరేటర్ లక్ష్యం దిశలో రామగుండం ఎన్టిపిసి నిర్దేశిత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు కొనసాగుతుంది. సామాజిక బాధ్యతలను ప్రభావిత గ్రామాలకు ఆధారంగా నిలుస్తూ సామాజిక సేవకు ప్రతిరూపంగా నిలిచి ప్రభావిత గ్రామాల అభివృద్ధిలో భాగంగా 2005లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ( సి ఎస్ ఆర్ ) పేరిట ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు కొనసాగుతుంది.
రామగుండం వెలుగుల్లో తమ వంతు పాత్ర అందించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపిన రామగుండం ఈడి .
ఎన్నో అవార్డులు అందుకుంటూ ముందుకు కొనసాగుతున్న రామగుండం ఎన్టిపిసి విద్యుత్ థర్మల్ కేంద్రం తమ ఉద్యోగులు , కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్&.టి .
ఎన్టీపీసీ ప్రథమంగా దేశంలో మొదటిసారిగా 1975 నవంబర్ 7న ఢిల్లీలో బదర్పూర్ లో ఎన్టిపిసి ప్రారంభించి , 51 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఎన్టిపిసి యాజమాన్ స్థానికంగా రామగుండం ఎన్టిపిసి లో 49వ రేసింగ్ డే వేడుకలను చేపట్టింది. ఉదయం 8 గంటలకు టౌన్షిప్ లో ఉద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ప్రభాత్ ఫెరి ( మార్నింగ్ వాక్) నిర్వహించి అనంతరం ఎన్టీపీసీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో ఎన్ టి వి సి జెండా ఆవిష్కరణ నిర్వహిస్తుంద.
ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రామగుండం ఈడి ప్రసంగించిన అనంతరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫయాజ్ తయ్యబ్ ఎన్టీపీసీ జెండా ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ఎన్టిపిసి పెర్మనెంట్ టౌన్షిప్ లోనీ మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో మెగా సాంస్కృతిక కార్యక్రమం, ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖప్రియ బృందంతో ప్రత్యేక సంగీత, సాంస్కృతిక ప్రదర్శన, అనంతరం విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమాలతో కొనసాగించనుంది.




