Ramagundam: ఎన్టీపీసీ సమతా గ్రంథాలయంలో ధమ్మ దీపావళి వేడుకలు

Ramagundam: రామగుండం ఎన్టీపీసీ సమతా గ్రంథాలయంలో ధమ్మ దీపావళి. బుద్ధుని మార్గంలో నడవాలని హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్, సమతా ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ పిలుపు.

VIJAY, RAMAGUNDAM
Published on: 8 Nov 2026 11:09 PM IST
Ramagundam
X

Ramagundam: ఎన్టీపీసీ సమతా గ్రంథాలయంలో ధమ్మ దీపావళి వేడుకలు

రామగుండం: రామగుండం ఎన్టిపిసి అన్నపూర్ణ కాలనీలోని సమతా గ్రంథాలయంలో ధమ్మ దీపావళి నిర్వహించారు . దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదని.. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపే సందేశమని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ , సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సమత ఫౌండేషన్ చైర్మన్ డా. మార్షల్ దుర్గం నగేష్ అన్నారు.

దీపావళి సందర్భంగా సమతా సైనిక దళ్ ఆధ్వర్యంలో స్థానిక గ్రంథాలయాన్ని దీపాలతో అలంకరించి భగవాన్ బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలు సమర్పించి బుద్ధవందనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బుద్ధుడు జ్ఞానోదయం అనంతరం కపిలవస్తుకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని, ఆ వెలుగులు జ్ఞానానికి ప్రతీకగా నిలిచాయన్నారు.

కళింగ యుద్ధంలో జరిగిన ప్రాణనష్టంతో చలించిపోయిన అశోక చక్రవర్తి హింసను విడిచిపెట్టి బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించడం చరిత్రలో గొప్ప పరివర్తనకు నిదర్శనమన్నారు. బుద్ధుడు బోధించిన ప్రజ్ఞ, శీలం, కరుణ, అష్టాంగ మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కులవివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలను రూపుమాపి సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

యువత విద్యకు ప్రాధాన్యమిస్తూ బుద్ధుని బోధనలు, అంబేద్కర్ రచనలను అధ్యయనం చేయాలని కోరారు. ప్రతి ఇంటా విద్యా వెలుగులు నిండాలని, ప్రతి మనసులో మానవత్వం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు ధమ్మ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఏఎస్పీ సెక్రటరీ వరప్రసాద్ రావు, సమతా గ్రంథాలయ చైర్మన్ దుర్గం ప్రమీల నగేష్ లతో పాటు సమతా సైనిక దళ్ పెద్దపల్లి జిల్లా నాయకులు ముడిమడుగుల సురేష్, చీమల ఆనంద్, జిమ్మిడి అశోక్, జిమ్మిడి శాంతి కుమార్, రామటింకి విశ్వనాథ ప్రతాప్, నాసా నరేష్, నాసా సునీత, హారిక, కృష్ణ, అరె లక్ష్మి, సునీల్, కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM