Manthani: కమాన్‌పూర్‌లో పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సర్పంచ్!

Manthani: కమాన్‌పూర్ మండలం జూలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు, క్రీడా దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు.

SHANKAR, MANTHANI
Published on: 2 Sept 2026 9:25 PM IST
Manthani
X

Manthani: కమాన్‌పూర్‌లో పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సర్పంచ్!

మంథాని: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం జూలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎన్టీపీసీ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ సర్పంచ్ పోలుదాసరి వనిత సాయికుమార్ చేతుల మీదుగా సైకిళ్లు, క్రీడా దుస్తులు, పుస్తకాల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పోలుదాసరి వనిత సాయికుమార్ మాట్లాడుతూ గ్రామంలోని విద్యార్థుల అభివృద్ధికి ఎన్టిపిసి సంస్థ ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టిపిసి వారు అందించిన సైకిళ్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

గ్రామ సర్పంచ్ పోలుదాసరి వనితా సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, ఉప సర్పంచ్ గడ్డం రాజమహేందర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి గుమ్మడి సదయ్యవార్డు సభ్యులు వేముల సత్యనారాయణ, ఉద్దమారి పద్మ, ఇరుగురాల రాజు, బొల్లంపల్లి సంతోష్ కుమార్, ఇరుగురాల రమేష్, సొప్పరి సంతోష్ కుమార్, పులి ప్రవళిక, లక్ష్మణ్ , పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story