Karimnagar: కరీంనగర్‌లో యువతి ఆత్మహత్య కేసు.. స్టాఫ్ నర్స్ అరెస్ట్!
Karimnagar: కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజిత ఆత్మహత్య కేసులో నిందితురాలు, స్టాఫ్ నర్స్ సిడం గీతాశ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు.
Karimnagar: కరీంనగర్‌లో యువతి ఆత్మహత్య కేసు.. స్టాఫ్ నర్స్ అరెస్ట్!
Karimnagar: కరీంనగర్-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి రాజిత ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితురాలు సిడం గీతాశ్రీ (26), స్టాఫ్ నర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే, మృతురాలు రాజిత, నిందితురాలు గీతాశ్రీ ఒకే ఆసుపత్రిలో పనిచేసే సమయంలో స్నేహితులుగా ఉండేవారు. గీతాశ్రీ ప్రేమించిన గణపతితో రాజిత సన్నిహితంగా ఉండటంతో, గీతాశ్రీ రాజితను వాట్సాప్ సందేశాలు, కాల్స్ ద్వారా బెదిరిస్తూ, దూషించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ వేధింపుల నేపథ్యంలో రాజిత 01-10-2026న ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు అందింది.
ఈ కేసులో నిందితురాలిని అదుపులోకి తీసుకుని, నేరానికి ఉపయోగించిన శాంసంగ్ మొబైల్ ఫోన్‌ను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్-2 టౌన్ పోలీసులు తెలిపారు.




