Odela: ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు క్లోజ్ అగ్నిగుండాల మహోత్సవంతో ముగింపు!

Odela: తెలంగాణ శ్రీశైలం ఓదెల మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. సోమవారం తెల్లవారుజామున భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల మొక్కులు చెల్లించుకున్న భక్తులు.

KONDAL, SULTANABAD
Published on: 13 July 2026 8:05 AM IST
Odela
X

Odela: ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు క్లోజ్ అగ్నిగుండాల మహోత్సవంతో ముగింపు!

Odela: తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో పెద్దపట్నం, అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ మల్లన్న జాతర, నేడు జరిగిన అగ్నిగుండ మహోత్సవంతో ముగింపు దశకు చేరుకుంది. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం కావడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.​

ఆలయ ఆవరణంలో ఒగ్గు పూజారులు సాంప్రదాయబద్ధంగా పెద్దపట్నం వేసి, స్వామివారి ఉత్సవ విగ్రహాలను అక్కడకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిగుండాల మహోత్సవంలో భక్తులు పోటెత్తారు. "శరణు శరణు మల్లన్న" అంటూ భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా అగ్నిగుండంపై నడిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని, పిల్లపాపలు చల్లగా ఉంటారని భక్తుల నమ్మకం.

​ఈ ముగింపు ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య ధర్మకర్తల మండలి చైర్మన్ మొండయ్య ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story