Peddapalli: నేడే ఓదెల మల్లికార్జున స్వామి పెద్దపట్నం మహోత్సవం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Peddapalli: నేడే ఓదెల మల్లికార్జున స్వామి పెద్దపట్నం మహోత్సవం!
పెద్దపల్లి: ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్న , అగ్నిగుండ మహోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం గణపతి పూజ, గౌరీ పూజ, మంటప స్థాపన , వీరభద్ర స్వామి ఆవాహన ,దేవతామూర్తుల ఆవాహన , సుంకు , యజ్ఞో హోమాలతో పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం రాత్రి పెద్దపట్నం బ్రహ్మోత్సవం , సోమవారం ఉదయం తెల్లవారుజామున అగ్నిగుండ మహోత్సవం ఘనంగా జరగనుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య , ఆలయ ఈవో సదయ్య, డైరెక్టర్లు ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.
Next Story




