Sircilla: టస్కా ఎల్లారెడ్డిపేట మండల సభ్యురాలిగా ఒగ్గు లక్ష్మి యాదవ్ నియామకం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల టస్కా సభ్యురాలిగా ఒగ్గు లక్ష్మి యాదవ్ నియామకం. వయోవృద్ధుల సంరక్షణ, కౌన్సెలింగ్‌లో భాగస్వామి కానున్న లక్ష్మి.

KALEEM, SIRICILLA
Published on: 24 Oct 2026 11:37 AM IST
Sircilla
X

Sircilla: టస్కా ఎల్లారెడ్డిపేట మండల సభ్యురాలిగా ఒగ్గు లక్ష్మి యాదవ్ నియామకం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ (టస్కా) ఎల్లారెడ్డిపేట మండల సభ్యురాలిగా మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు ఒగ్గు లక్ష్మి యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు టస్కా జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య లేఖ నంబర్‌ 55 ద్వారా నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

టస్కా సభ్యురాలిగా ఒగ్గు లక్ష్మి యాదవ్ వయోవృద్ధుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వృద్ధాప్యంలో వారిని పోషించని కుమారులపై వృద్ధులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, టస్కా సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు లక్ష్మి యాదవ్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు పాల్గొని కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

తనను టస్కా సభ్యురాలిగా నియమించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనపాల శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి చెన్నమాధవ్‌ని రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం నారాయణ, కోశాధికారి దొంత దేవదాసుకు ఒగ్గు లక్ష్మి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA