Karimnagar: మత్తు పదార్థాల రవాణాపై సీపీ గౌస్ ఆలం నిఘా తీవ్రం!

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ లో కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.

SUDHAKAR, KARIMNGAR TOWN
Updated on: 22 July 2026 6:16 PM IST
Karimnagar
X

Karimnagar: మత్తు పదార్థాల రవాణాపై సీపీ గౌస్ ఆలం నిఘా తీవ్రం!

కరీంనగర్: మత్తు పదార్థాలు మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల వారీగా ప్రాజెక్టుల పరిధిలో నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు.నెలవారి ప్లాన్ తో పాటు ఏడాది పాటు చేసే కార్యక్రమాలను రూపొందించాలని వివరించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. విద్యాసంస్థలు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించి తనిఖీలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.

డీఈవో చైతన్య జైనీ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నిరోధక క్లబ్బులు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెంట్ నాగేశ్వరరావు తెలిపారు.

డీడబ్ల్యుఓ సరస్వతి మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో వాలంటీర్ల సహాయంతో తరచుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story