Karimnagar: కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు!
Karimnagar: కరీంనగర్ నగరంలో ఘనంగా ఓపెన్ జిమ్ ప్రారంభం.. అన్ని డివిజన్లలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్.
Karimnagar: కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు!
Karimnagar: నగర అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరంలోని 42వ డివిజన్లో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్మును, ప్రారంభించిన కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగర అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి కరీంనగర్ నగర పాలక సంస్థ పనిచేస్తుందని అవసరమైన అన్ని నిధులు తిసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు.
నగరంలోని అతిపెద్ద సమస్య అయినా డంపింగ్ యార్డ్ ను అతి త్వరలోనే వారం రోజులలోగా 17 కోట్లతో టెండర్లను పిలుస్తామని తెలిపారు. నగర అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రాష్ట్ర కేంద్ర నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. 42వ డివిజన్లో యు ఐ డి ఎఫ్ ద్వారా 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 49వ డివిజన్లో 60 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ, మూడవ డివిజన్లో 75 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు నేడు శంకుస్థాపన చేసి వేగవంతంగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
నగర ప్రజల ఆరోగ్యం కోసం నగరంలోని అన్ని డివిజన్లో జిమ్ములను ఏర్పాటు చేస్తామని దీనికి కావాల్సిన నిధులు త్వరలోనే తెస్తామన్నారు. విలీన డివిజన్లతో పాటు అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేస్తామని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే నగరపాలక సంస్థ
లక్షమని దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ తో పాటు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి, స్థానిక డివిజన్ కార్పొరేటర్లు ప్రజలు పాల్గొన్నారు.




