Sircilla: సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా!
Sircilla: సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు.
Sircilla: సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా!
Sircilla: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తామని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ.. ఎండనకా, వాననకా కష్టపడి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు, 60 సంవత్సరాలు నిండిన కార్మికుల కుటుంబీకులకు ఉపాధి కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
2009 నుంచి 2012 వరకు పెండింగ్లో ఉన్న పీఎఫ్ డబ్బులను కార్మికులకు చెల్లించడం లేదని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే నెల 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సిఐటియు నాయకుడు కోడం రమణ, సిపిఎం నాయకుడు మూషం రమేష్ తదితరులు పాల్గొన్నారు.




