Karimnagar: రోడ్లపై వరి ధాన్యం కుప్పలు.. నిండు ప్రాణాలు బలి!
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండలాల్లో రోడ్లపై వరి ధాన్యం ఆరబోయడం వల్ల జరుగుతున్న ప్రమాాలపై మృతుల కుటుంబాల ఆవేదన.
Karimnagar: రోడ్లపై వరి ధాన్యం కుప్పలు.. నిండు ప్రాణాలు బలి!
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లంతకుంట వీణవంక మండలాల్లో రైతులకు మళ్లీ ధాన్యం కష్టాలు మొదలయ్యాయి. మరింత మంది మృతి చెందుతారు ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయో మృతి చెందిన బంధువుల ఆవేదన.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వీణవంక మండలం ఇల్లంతకుంట మండలం లో రైతులు పంట చేతికొచ్చి వరి కోతలు ప్రారంభమైన వేళ.తమ కష్టాన్ని ధాన్యంగా మార్చుకున్న రైతులకు ఆ ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో వరి కోతలు పూర్తయిన తర్వాత ధాన్యాన్ని పొలాల దగ్గర్నే కల్లాలు చేసుకుని ఆరబెట్టేవారు రైతులు ఇంట్లో పెట్టుకునే వారు స్థలం లేక, కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ సరియైన సదుపాయాలు అందుబాటులో లేక రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబోసి, రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వర్షం వస్తే ధాన్యంతడిసిపోతుందనే భయం.కొనుగోళ్లు ఆలస్యమైతే నష్టపోతామనే ఆందోళన రైతులను వెంటాడుతోంది.ఇప్పుడు మళ్లీ వరి కోతలు ప్రారంభం కావడంతో అదే పరిస్థితి పునరావృతమవుతుందనే భయంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రోడ్లపై పడిగాపులు కాయాల్సిన దుస్థితి నుంచి రైతులకు ఎప్పుడు విముక్తి లభిస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరి దానం కొయ్యకు ముందే రైతులు రోడ్డు ప్రక్కన సంచుల మీద బండలు పెట్టి రోడ్డును ఆక్రమించుకుంటూన్నారు ఇలా ప్రతి సంవత్సరం వరి ధాన్యం రోడ్డుపై ఆరబెట్టడం వన్ సైడు వల్ల వచ్చి పోయేటి బైకులు వాహనాలు రోజు 24 గంటలు హైవే మీద తిరుగుతాయని ఇంట్లో నుండి బయటికి వెళ్లిన వ్యక్తి ఎప్పుడు తిరిగి వస్తాడో భయం భయంగా ఉందని యాక్సిడెంట్ అయి 15 మంది మృతి చెందుతున్నారని మృతి చెందిన కుటుంబాలు వేడుకుంటున్నారు ఇకనైనా రైతులు రోడ్డుపై వరి ధాన్యాలు పోయావద్దని వాళ్ళ బతుకులు కూడా మా బతుకులగా చేయవదు అని మృతి చెందిన బంధువులు వేడుకుంటున్నారు
ఇప్పటికైనా అధికారులు స్పందించాలి! వరి ధాన్యాలు పోసిన రైతులపై పోలీసులు కేసులు పెట్టాలని ఇప్పటివరకు ఒక్క కేసు కూడా రైతుల మీద పెట్టలేదని అసలు పోలీస్ శాఖ అసలు పట్టించుకోవడమే లేదని మృతి చెందిన బంధువులు వేడుకుంటున్నారు మా ఇంటికి పెద్ద దిక్కులు పోయేసరికి రోడ్డు మీద పడ్డామని ఇప్పటికైనా పోలీసు శాఖ పట్టించుకుని రోడ్డుమీద ఇప్పుడే ఆపాలని ఆ యొక్క బండలను తీసేసి వండ్ల రోడ్డు మీద పోసే రాక చూడొద్దని వేడుకుంటున్నారు మృతి చెందిన బంధువులు రోదనతో. రెండు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఇప్పటికి మరి అధికారులు ముందుకు వస్తారా మరి ఎంత మంది మృతి చెందారో ధాన్యాలకుప్పలు వల్ల మృతి చెందిన బంధువు ఆవేదన.




