Rajanna Sircilla: దళారుల దోపిడీకి చెక్.. తడగొండలో వరి కొనుగోలు కేంద్రం ఓపెన్!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ప్రారంభించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 22 April 2026 2:29 PM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: దళారుల దోపిడీకి చెక్.. తడగొండలో వరి కొనుగోలు కేంద్రం ఓపెన్!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలంలో రైతులకు ఊరటనిచ్చే విధంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. బోయిన్‌పల్లి మండలకేంద్రంలోని మార్కెట్ యార్డుతో పాటు తడగొండ గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాలను చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ధాన్యం తూకం, నాణ్యత పరిశీలన, చెల్లింపుల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు తక్షణమే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story