Sircilla: సిరిసిల్ల బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారికి పూజలు!
Sircilla: సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పణ!
Sircilla: సిరిసిల్ల బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారికి పూజలు!
సిరిసిల్ల: శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం పద్మశాలి సంఘం, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలీల ఇంటి ఆడపడుచుగా భావించే పద్మావతి అమ్మవారిని మంగళ వాయిద్యాల నడుమ మార్కండేయ దేవాలయం నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు.
అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లకు పూలమాలలు, పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి మంగళహారతులు ఇచ్చారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో పద్మశాలి సంఘాలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.




