Peddapalli: భారీ వర్షాలకు కనువిందు చేస్తున్న పాండవలంక జలపాతం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పాండవలంక జలపాతం భారీ వర్షాలకు జలకళ సంతరించుకుంది.
Peddapalli: భారీ వర్షాలకు కనువిందు చేస్తున్న పాండవలంక జలపాతం!
Peddapalli: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పరిధిలోని పాండవలంక జలపాతం జలకళ సంతరించుకుంది. వెన్నంపల్లి మరియు జాఫర్ ఖాన్ పేట గ్రామాల సరిహద్దుల మధ్య గుట్టల్లో ఉన్న ఈ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
వర్షాల ధాటికి ఎత్తైన పర్వతాల నుండి దూకుతున్న నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. జలపాత సౌందర్యాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రవాహం ఎక్కువగా ఉన్నందున సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
Next Story




