Karimnagar: అమ్మ వద్దంది.. నాన్న వద్దన్నాడు.. పోలీసుల వద్ద చిన్నారులు

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో విషాదం. దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగా ఇద్దరు ఆడపిల్లలను పోలీస్ స్టేషన్‌లోనే వదిలేసి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 April 2026 6:02 PM IST
Karimnagar
X

Karimnagar: అమ్మ వద్దంది.. నాన్న వద్దన్నాడు.. పోలీసుల వద్ద చిన్నారులు

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ లో గల తమిళ కాలనీ కి చెందిన రవికుమార్, నిజామాబాద్ కు చెందిన లలిత సుమారు పదేళ్ల కింద ఒకరికొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చి వేరుగా ఉంటున్నారు.

లలిత నిజమాబాద్ లో ఇద్దరు కూతుర్లతో ఉండగా, రవికుమార్ తమిళ కాలనీలో ఉంటున్నాడు. అయితే వీరి పంచాయతీ పోలీస్ స్టేషన్కు రాగా పోలీసులు దంపతుల మధ్య సయోధ్య కుదురుచేందుకు కౌన్సిలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. లలిత తనకు భర్త, పిల్లలు అక్కర్లేదంటూ ఆమె తాళి, మెట్టలు తీసి టేబుల్ పై పెట్టి పిల్లలను స్టేషన్లోనే వదిలేసి వెళ్ళిపోయింది.

పోలీసులువారించినప్పటికీ మొండిపట్టుగా పిల్లలను వదిలేసి వెళ్లిపోగా.. భర్త సైతం తనకు కూడా వద్దంటూ పిల్లలను వదిలి వెళ్ళిపోయాడు.

బిక్కు బిక్కుమంటూ చిన్నారులు..భార్య భర్తల మధ్య మనస్పర్ధలతో ఇద్దరు చిన్నారులను స్టేషన్ లోనే తల్లిదండ్రులు వదిలి వెళ్లడంతో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ అమ్మ కావాలి అంటూ ఏడుస్తూ కనిపించడం పోలీసులతోపాటు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అల్లారు ముద్దుగా ఉన్న పిల్లలను ఎలా వదలేశరంటూ పలువురు తిట్టి పోశారు. ఎస్సై అన్వర్ చిన్నారుల నానమ్మ వివరాలు తెలుసుకొని ఆమెకు అప్పగించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story