Parkal: 96 యూనిట్ల పాడి గేదెల పత్రాలను పంపిణీ చేసిన రేవూరి

Parkal: పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 96 యూనిట్ల పాడి గేదెల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దళిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 4 Sept 2026 11:39 PM IST
Parkal
X

Parkal: 96 యూనిట్ల పాడి గేదెల పత్రాలను పంపిణీ చేసిన రేవూరి

పరకాల: పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఆత్మకూరు, దామెర మండలాలకు 96 యూనిట్స్ పాడి గేదెల మంజూరి పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంనందు ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన దళిత కుటుంబాలకు పాడి గేదెల మంజూరి పత్రాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.

అంతకుముందు పశువైద్యులు లబ్ధిదారులకు పాడి గేదెల పెంపకం, పశువులకు అందించాల్సిన పోషకాహారం, వ్యాధుల నివారణ, టీకాలు, వాతావరణ మార్పుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన, జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని అన్నారు.

మహిళా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.పరకాల ఇందిరా మహిళా డైరీ ద్వారా రాబోయే 2 సంవత్సరాలలో దాదాపు 40వేల కుటుంబాలకు ప్రతి ఇంటికి 2 గేదెలను అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.పాడి గేదెల పెంపకం ద్వారా పేద కుటుంబాలు స్వయం ఉపాధిని పొందుతూ తమ కుటుంబ ఆర్థిక ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఆత్మకూరు మండలం కు 72 యూనిట్స్, దామోర మండలానికి 24 యూనిట్స్ ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశామని,యూనిట్ కాస్ట్ 2లక్షలు అని, దీనిలో సబ్సిడీ 1లక్ష 60 వేలు,బ్యాంక్ లోన్ 40 వేలు ఇస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా పశువులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున, పాడి రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పశువులకు సకాలంలో టీకాలు, వైద్య పరీక్షలు, పోషకాహారం అందిస్తూ ఆరోగ్యంగా పెంచితే పాల ఉత్పత్తి పెరిగి కుటుంబాలకు మరింత ఆదాయం లభిస్తుందని అన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story