Karimnagar: త్వరపడండి! ఆస్తి పన్ను రాయితీకి ఏప్రిల్ 30 చివరి తేదీ!
Karimnagar: కరీంనగర్ నగర ప్రజలకు మేయర్ విజ్ఞప్తి. ఆస్తి పన్నుపై 5% రాయితీ పొందే 'ఎర్లీ బర్డ్' స్కీమ్‌కు ఏప్రిల్ 30తో గడువు ముగింపు.
Karimnagar: త్వరపడండి! ఆస్తి పన్ను రాయితీకి ఏప్రిల్ 30 చివరి తేదీ!
కరీంనగర్: నగర ప్రజలు "ఎర్లీ బర్డ్ స్కీమ్" ను సద్వినియోగం చేస్కోని ఆస్తి పన్ను చెల్లింపులో 5% రాయితీ పొందాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. మేయర్ మాట్లాడుతూ... 2026-2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం "ఎర్లీ బర్డ్" పథకంను ప్రజలకు అందు బాటులోకి తెచ్చిందని, ఈ పథకం 30-04-2026 తో ముగుస్తుందని తెలిపారు. చివరి 3 రోజుల గడువు మాత్రమే ఉన్నందున నగర ప్రజలు తమ ఆస్తి పన్నును చెల్లించి...5% శాతం రాయితీని పొందాలని కోరారు. ఆస్తి పన్నును నగరపాలక సంస్థ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో గానీ, వారి డివిజన్ కు సంబంధించిన వార్డు ఆఫీసర్ కు గానీ, ఆన్ లైన్ ద్వారా గానీ చెల్లించి ప్రభుత్వం అందిస్తున్న రాయితీని పొంది నగర అభివృద్ధికి సహాకరించాలని కోరారు.
Next Story




