Karimnagar: శాతవాహన వర్సిటీలో క్రీడా సందడి.. వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు షురూ!
Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయంలో ఉత్సాహంగా కొనసాగుతున్న వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు.
Karimnagar: శాతవాహన వర్సిటీలో క్రీడా సందడి.. వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు షురూ!
కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాయామ విద్య-2026 ప్రవేశ పరీక్షలను రెండవ రోజు విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిరోజు పరీక్షలు చాలా కట్టుదిట్టంగా నిర్వహించామని వ్యాయామ విద్య పరీక్షలకు ఉన్న డిమాండ్ అనుసరించి కళాశాలలో సీట్లు పెరగాలని అన్నారు. అభ్యర్థులు శారీరక నైపుణ్య పరీక్షలో తమ యొక్క ప్రతిభను చూపాలని దానితో వారికి మెరుగైన మార్కులతో మంచి కళాశాలలో సీటు లభించే అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం పరిమితమైన సీట్లు ఉన్నాయని దాంతో పోటీలలో అభ్యర్థులు తమ శక్తిమేరకు ప్రయత్నం చేసి శారీరక దృఢత్వ పరీక్ష, నైపుణ్య అభివృద్ధి పరీక్షలలో ప్రతిభ చాటుతూ తెలంగాణ పిఈసెట్ 2026 కి అర్హత సాధించాలని కోరారు. కొంతమంది అభ్యర్థులకు జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయి క్రీడలలో పాల్గొన్నట్లయితే వారికి అదనంగా మార్కులు లభించే అవకాశం ఉన్నదని, నైపుణ్యాలను ఇంకా మెరుగుపరుచుకోవాలని, వచ్చే సంవత్సరంలోగా తాము 'బహుళ ప్రయోజన కాంప్లెక్స్' నిర్మాణాన్ని పూర్తిచేసి, అత్యాధునిక వసతులు కల్పించి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ క్రీడలతో మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని, అభ్యర్థులు శారీరకంగా దృఢత్వంగా ఉండడానికి ప్రత్యేక సాధన చేసి శక్తి మేరకు సత్తా చాటి ప్రతిభ సాధించాలన్నారు.
వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షల కన్వీనర్ ఆచార్య రాజేష్ కుమార్ మాట్లాడుతూ వేసవి తాపం వలన అభ్యర్థులు అలసిపోకుండా ఉండడానికి ఉదయం 6:30 నుండి అన్ని సౌకర్యాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని రేపటినుండి మహిళలకు పరీక్షలు జరుగుతాయని, అనుభవిజ్ఞులైన టెస్టర్ లతో అభ్యర్థులకు దేహదారుడ్య శారీరక పరీక్షలు నిర్వ నిర్వహిస్తున్నామని తెలిపారు.
రెండవరోజు బ్యాచిలర్ వ్యాయామ విద్యలో 701 దరఖాస్తు చేసుకోగా అందులో 529 మంది ప్రవేశ పరీక్షలో పాల్గొనగా 179 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని అలాగే డిప్లమా వ్యాయామ విద్యలో 306 మంది దరఖాస్తు చేసుకోగా 211 మంది పరీక్షలకు హాజరవుగా 95 మంది గైర్హాజరయ్యారని శారీరిక సామర్ధ్య పరీక్షల్లో భాగంగా పురుషుల విద్యార్థులకు 100 మీటర్లు, 800 మీటర్ల పరుగు, షాట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్ పోటీలు నిర్వహించామని శరీర నైపుణ్య పరీక్షలకు సంబంధించి ఫుట్ బాల్ , వాలీబాల్, ఖో ఖో, క్రికెట్, కబడ్డీ పరీక్షలు నిర్వహించి నైపుణ్య పరీక్షలను పూర్తి చేశారని తెలిపారు.
ఈ వ్యాయామ విద్య పరీక్ష రెండవ రోజు రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్, శాతవాహన స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ నజీముద్దీన్ మునవర్, డాక్టర్ దీప్లా, డాక్టర్ జగన్, డాక్టర్ సుధాకర్ రావు,ఆచార్య సునీల్ కుమార్, శాతవాహన పీడీ విజయ్ కుమార్,వివిధ విశ్వవిద్యాలయ వ్యాయామ అధికారులు, వ్యాయామ శిక్షకులు పాల్గొని పరీక్షలను నిర్వహించారు.




