Sultanabad: సుల్తానాబాద్‌లో విషాదం అనుమానాస్పద స్థితిలో జాతీయ పక్షి మృతి!

Sultanabad: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో విషాదం. వారాహి రెస్టారెంట్ సమీపంలో నెమలి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

KONDAL, SULTANABAD
Published on: 9 May 2026 1:00 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్‌లో విషాదం అనుమానాస్పద స్థితిలో జాతీయ పక్షి మృతి!

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వారాహి రెస్టారెంట్ పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో ఒక నెమలి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉంది. గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు నెమలి మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నెమలిని స్థానిక వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాత నెమలి మృతికి గల పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story