Jagtial: కోనాపూర్‌లో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన!
Jagtial: జగిత్యాల జిల్లా కోనాపూర్‌లో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు ఘనంగా జరిగాయి.
Jagtial: కోనాపూర్‌లో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన!
జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ ప్రజలు, భక్తుల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో ఈ వేడుకలు కొనసాగాయి. మొదటగా ఎమ్మెల్యే పెద్దమ్మ తల్లిని.దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గ్రామ దేవతల పట్ల భక్తి భావం మన సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.




