Kamanpur: పెద్దపల్లిలో 'చేయూత' పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ
Kamanpur: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పేరపల్లిలో చేయూత పథకం పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్ సదయ్య కోరారు.
Kamanpur: పెద్దపల్లిలో 'చేయూత' పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ
కమాన్పూర్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘చేయూత’ పథకం కింద నూతన పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ గురువారం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పేరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొంగోని సదయ్య మాట్లాడుతూ.. నూతన పింఛన్లు మంజూరు కానున్నందున అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు ప్రభుత్వం సూచించిన అవసరమైన పత్రాలతో గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
అధికారులు దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పింఛన్లు మంజూరవుతాయని సర్పంచ్ తెలిపారు.




