Kalvasrirampur: కాల్వశ్రీరాంపూర్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బంగారి రమేష్
Kalvasrirampur: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బంగారి రమేష్ ఏకగ్రీవ ఎన్నిక. ఘనంగా సన్మానించిన నాయకులు, సర్పంచులు.
Kalvasrirampur: కాల్వశ్రీరాంపూర్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బంగారి రమేష్
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి కాల్వశ్రీరాంపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా కాల్వశ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్ మండల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక సర్పంచులంతా కాల్వ శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్ ను సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బంగారి రమేష్‌ను సర్పంచులు, మాజీ ఎంపీపీ గొపగని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులుగాజనమైన సదయ్య తోపాటు పలువురు నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బంగారి రమేష్ మాట్లాడుతూ...తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన మండల సర్పంచులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి ముందుండి తన వంతుగా కృషి చేస్తానని వారు తెలిపారు.
సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షునిగా ఎన్నికకు సహకరించిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు కు,మండల సర్పంచులు మాజీ ఎంపీపీ గోపగొని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పలువురు సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




