Peddapalli: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం - దాసరి మనోహర్ రెడ్డి

Peddapalli: పెద్దపల్లి కలెక్టరేట్‌లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రజావాణిలో కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై వినతిపత్రం అందజేశారు.

RAJU, PEDDAPALLI
Published on: 7 Sept 2026 6:17 PM IST
Peddapalli
X

Peddapalli: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం - దాసరి మనోహర్ రెడ్డి

పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 420 హామీల అమలుపై వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత హామీల అమలును విస్మరించిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుందని అన్నారు.

మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, ఉద్యోగులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని, కానీ వాటిలో చాలావరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన ఆరోపించారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story