Peddapalli: సైకత శిల్పంతో దాసరి ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు!
Peddapalli: ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాజమండ్రి గోదావరి తీరాన సైకత శిల్పం రూపొందించి ఫ్రేమ్‌ను బహూకరించిన యువనేత కొమ్మ సతీష్ యాదవ్.
Peddapalli: సైకత శిల్పంతో దాసరి ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు!
పెద్దపల్లి: ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా యువజన నాయకులు కొమ్మ సతీష్ యాదవ్ వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి గోదావరి తీరాన దాసరి ప్రశాంత్ రెడ్డి చిత్రపటంతో కూడిన అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది.
అనంతరం ఆ సైకత శిల్పం ఫోటో ఫ్రేమ్ ను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ యువజన నాయకులు కొమ్మ సతీష్ యాదవ్ అందజేశారు. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ప్రశాంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




