Peddapalli: ప్రజలకు భారీ ఊరట రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేలా కొత్త బైపాస్

Peddapalli: అభివృద్ధిలో మరో మైలురాయి. 82 కోట్ల రూపాయలతో 12.1 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 May 2026 12:35 PM IST
Peddapalli
X

Peddapalli: ప్రజలకు భారీ ఊరట రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేలా కొత్త బైపాస్

పెద్దపల్లి: పెద్దపల్లి మండలం పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రూ. 82 కోట్లతో నూతనంగా నిర్మించే బైపాస్ రోడ్డు నిర్మాణానికి స్థానిక నాయకులతో మరియు అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారు మాట్లాడుతూ..

పెద్దపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని పార్టీలకు అతీతంగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి మద్దతు ఇవ్వాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి నియోజకవర్గానికి రూ. 82 కోట్లతో బైపాస్ రోడ్డు మంజూరు చేయడం శుభ సూచకం అని పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి గౌరవ మంత్రుల సహకారంతో చేయడం జరుగుతుందని అన్నారు.

పెద్దపల్లి లో ఎన్నడు లేని విధంగా బస్సు డిపో, జిల్లా కోర్టు భవనం, డబల్ లైన్ రోడ్ల నిర్మాణాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, మినీ ట్యాంక్ బండ్ల నిర్మాణాలు, బ్యాడ్మింటన్ కోర్టులు, నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణాలు, సెంట్రల్ లైటింగ్లు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి రోడ్డు మార్గాన్ని సులభతరం చేసే దిశగా డబల్ రోడ్డులు, దేవాలయాల అభివృద్ధి మరియు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మరియు పెద్దపల్లి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అలాగే అమృత్ పథకం ద్వారా మంచి నీటి ట్యాంకులను నిర్మిస్తూ ప్రజల అవసరాలను తీస్తున్నామని గుర్తు చేశారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల నుండి నిట్టూరు, చందపల్లి మీదుగా అప్పన్నపేట వరకు 12 కిలో మీటర్ల మేరకు డబల్ లైన్ రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ తో కూడిన బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఈరోజు పనులు ప్రారంభించుకోవడం ఆనందదాయకం అని అన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రజలందరూ సహకరిస్తూ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు, స్థానిక సర్పంచు, గ్రామ పాలకవర్గం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు. డైరెక్టర్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story