Kalva Srirampur: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు.. అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ వార్నింగ్!

Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో వరి ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 17 May 2026 3:51 PM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు.. అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ వార్నింగ్!

Kalva Srirampur: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, లిఫ్టింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించేరు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి కాలనీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, గంగారం ఐకేపీ కేంద్రాన్ని, అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న వరి ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.అనంతరం మండలంలోని మంగపేట గ్రామంలో ఉన్న అన్నదాత రైస్ మిల్లును సందర్శించి ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ప్రతిరోజూ లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. రైస్ మిల్లుల్లో అన్‌లోడింగ్ త్వరితగతిన పూర్తిచేయాలని, లారీల షెడ్లు పెండింగ్‌లో ఉండకుండా క్రమం తప్పకుండా క్లియర్ చేయాలని మిల్లర్లకు ఆదేశించారు.రైతులకు కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పేర్కొన్నారు.అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు, రవాణా ప్రక్రియలను సజావుగా నిర్వహించాలని సూచించారు.ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ సిబ్బంది రవీందర్, రాజి రెడ్డి,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story