Peddapalli: డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి నెల రోజుల్లో బకాయిలు రికవరీ చేయాలి!

Peddapalli: డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం. ఆస్తులు వేలం వేసి నెల రోజుల్లో బకాయిలు వసూలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం.

RAJU, PEDDAPALLI
Published on: 3 Sept 2026 11:22 AM IST
Peddapalli
X

Peddapalli: డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి నెల రోజుల్లో బకాయిలు రికవరీ చేయాలి!

Peddapalli: డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వం పొందాల్సిన బకాయిలను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం పూర్తిస్థాయిలో వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిల వసూళ్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు సంబంధించిన ఆస్తులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సదరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం విలువను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం రికవరీ చేయాలని సూచించారు.

డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిల వసూళ్లకు సంబంధించి తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు సమన్వయంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సంబంధిత రైస్ మిల్లర్ల ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో గుర్తించి, బకాయిల రికవరీకి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.

రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించి, డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి మొత్తం బకాయి మొత్తాన్ని నెల రోజుల్లోగా పూర్తిగా వసూలు చేయాలని స్పష్టం చేశారు. బకాయిల వసూళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులో చర్యలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

డిఫాల్ట్ రైస్ మిల్లర్ల ఆస్తుల గుర్తింపు, రికార్డుల పరిశీలన, బకాయిల నిర్ధారణ తదితర అంశాల్లో సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్దేశించిన గడువులో బకాయిల వసూళ్లు పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీవోలు బి. గంగయ్య, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story