Manthani: సుందిళ్ల నరసింహస్వామిని దర్శించుకున్న పెద్దపల్లి డీసీపీ!

Manthani: పెద్దపల్లి డీసీపీ బుక్యా రామ్‌రెడ్డి దంపతులు రామగిరి మండలం సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

SHANKAR, MANTHANI
Published on: 20 Aug 2026 6:18 PM IST
Manthani
X

Manthani: సుందిళ్ల నరసింహస్వామిని దర్శించుకున్న పెద్దపల్లి డీసీపీ!

మంథాని: పెద్దపల్లి డీసీపీ బుక్యా రామ్‌రెడ్డి సతీసమేతంగా రామగిరి మండలంలోని సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి, దేవస్థాన చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్ సమక్షంలో ఆలయ అర్చకులు రుద్ర భట్ల జయంత్ శర్మ డీసీపీ దంపతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ దంపతులు మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు వారికి ఆత్మీయంగా స్వాగతం పలికారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story