Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కుల వివక్ష కలకలం.. 20 మందిపై అట్రాసిటీ కేసు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తీవ్ర కలకలం రేపిన కుల వివక్ష ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కుల వివక్ష కలకలం.. 20 మందిపై అట్రాసిటీ కేసు!
Peddapalli: జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన కుల వివక్ష ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. తమను కులం పేరుతో దూషించి, అవమానించారంటూ ఓ దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఏకంగా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘటన వివరాల్లోకి వెళితే..
కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన ఆసంపల్లి స్వరూప అనే దళిత మహిళను ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో కొంతమంది వ్యక్తులు కులం పేరుతో దూషించడమే కాకుండా, వివక్ష పూరితంగా వ్యవహరించారు. దళిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.బాధితురాలి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కాల్వ శ్రీరాంపూర్ SI వెంకటేష్ ఘటనకు కారణమైన 20 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
పోలీసుల స్పందన:
ఈ ఘటనపై కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు స్పందిస్తూ.. "కుల వివక్ష, వేధింపుల వంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం" ఎస్సై వెంకటేష్ తెలిపారు.




