Manthani: భూసేకరణలో దళారులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్

Manthani: మంథని సహా జిల్లాలో భూసేకరణ పరిహారం విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజలను హెచ్చరించారు.

SHANKAR, MANTHANI
Published on: 25 Sept 2026 6:25 PM IST
Manthani
X

Manthani: భూసేకరణలో దళారులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్

Manthani: మంథాని భూసేకరణ విషయంలో దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములు కోల్పోయే బాధితులకు నష్టపరిహారం నేరుగా అందజేస్తామని స్పష్టం చేశారు.

రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, రాజాపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న భూసేకరణతో పాటు జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే మార్గాల విస్తరణకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియలో కొంతమంది దళారులు, మధ్యవర్తులు ప్రజలను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామని నమ్మిస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన భూ నిర్వాసితులకు అధికారులు నష్టపరిహారం అందజేస్తారని తెలిపారు. పరిశ్రమలు, సింగరేణి, జాతీయ రహదారులు, రైల్వేలకు సంబంధించిన భూసేకరణలో ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు డిమాండ్ చేసినా, మోసపూరితంగా వ్యవహరించినా వెంటనే సంబంధిత అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. అనధికార వ్యక్తులను నమ్మి ప్రజలు డబ్బులు చెల్లించి నష్టపోవద్దని ఆయన హెచ్చరించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI