Peddapalli: తాగి స్కూల్ వ్యాన్ నడిపిన డ్రైవర్
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మద్యం మత్తులో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు.
Peddapalli: తాగి స్కూల్ వ్యాన్ నడిపిన డ్రైవర్
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంల గురువారం ఉదయం ఒక ప్రైవేట్ స్కూల్ వ్యాన్ తృటిలో ఘోర ప్రమాదం నుండి తప్పించుకుంది. డ్రైవర్ అతిగా మద్యం సేవించి వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని మంగపేట గ్రామం నుండి సుమారు 40 మంది విద్యార్థులతో పెగడపల్లిలోని 'సన్ షైన్ స్కూల్'కు బయలుదేరిన స్కూల్ వ్యాన్, మంగపేట ఎల్లమ్మ గుడి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో, వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న సిమెంటు గద్దెను ఢీ కొట్టింది, అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ఆ తర్వాత అదే వేగంతో వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది.ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ లో 40 మంది చిన్నారి విద్యార్థులు ఉన్నారు. దైవవశాత్తూ విద్యుత్ స్తంభం విరిగిపడకపోవడం, వాహనం ఆగిపోవడంతో విద్యార్థులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో ఘటనా స్థలానికి పరుగులు తీశారు.
తమ పిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలను సురక్షితంగా స్కూళ్లకు చేర్చాల్సిన డ్రైవర్లు ఇలా తాగి వాహనాలు నడపడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్, రవాణా శాఖ అధికారులను డిమాండ్ చేశారు.




