Godavarikhani: ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక అవస్థలు

Godavarikhani: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో లిఫ్ట్ నిలిచిపోవడం, మౌలిక వసతులు కరవవడంపై అధికారుల తీరును తప్పుబట్టిన డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కొంటు సాగర్.

VIJAY, RAMAGUNDAM
Published on: 12 Nov 2026 10:58 PM IST
Godavarikhani
X

Godavarikhani: ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక అవస్థలు

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని అధికారుల పాలకుల నెలకోసారి తనిఖీలు హంగులు ఆర్భాటాల కోసమే తప్ప ఆచరణలో ఆసుపత్రి సిబ్బంది పేషెంట్లకు ఎటువంటి ఉపయోగం లేదని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద ఆసుపత్రిగా పేరుందిన గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో రోజువారీగా వేల సంఖ్యలో ఓపీ సేవలతో పాటు అనుబంధంగా మెడికల్ కళాశాల ఉండటం భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు 500 పడకల ఆసుపత్రి నిర్మించటం అధికారులు పాలకులకు గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఆచరణలో మాత్రం ఆసుపత్రి సిబ్బందికి పేషెంట్లకు పేషెంట్ బంధువులకు కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ఆస్పత్రిలో సరైన మెయింటెనెన్స్ లేక గత వారం నుండి లిఫ్ట్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఆసుపత్రి సిబ్బందితోపాటు పేషెంట్లకు ఆహారం అందించే డైట్ సిబ్బంది మరియు పేషెంట్ బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా పిల్లల వార్డు సమీపంలో పేషెంట్ తరఫున వచ్చిన బంధువులు వేచి ఉండటానికి కూర్చోవడానికి సరైన కుర్చీ సదుపాయలు లేని దుస్థితి ఇక్కడ నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆసుపత్రి సిబ్బంది మొదటి రెండో అంతస్తులకు అత్యవసరంగా మందులు గాని సర్జికల్ ఐటమ్స్ గాని ఇతర ఏ సామాగ్రిని తరలించాలన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నాయి అన్నారు. గతంలో ఇక్కడ పేషెంట్లకు ఆహారం అందించే డైట్ నిర్వహణ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండేదని ఇప్పుడు పేషెంట్లకు అందించే ఆహారం రోజు సెంటనేరీ కాలనీ జేఎన్టీయూ కళాశాల నుండి సకాలంలో రాకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డైట్ నిర్వహణ వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోకి మార్చాలని డిమాండ్ చేశారు.

నెలలో ఒకటి రెండు సార్లు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు తనిఖీలు రివ్యూలు హాస్పటల్ ఉన్నతాధికారులతో చేయడం కాకుండా ఆసుపత్రికి వచ్చే పేషంట్లతో వారి బంధువులతో ముఖ్యంగా ఆస్పటల్ క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్వహించాలని అప్పుడే ప్రధానంగా హాస్పటల్లో నెలకొన్న సమస్యలు తెలుస్తాయి తప్ప ఏదో మొక్కుబడిగా ఆసుపత్రి ఉన్నతాధికారులతో రివ్యూ చేసి తనిఖీలు చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదని వారికి సందర్భంగా అన్నారు కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా తెలిపారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM