Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో గణేష్ మండపాల్లో దాసరి మనోహర్ రెడ్డి పూజలు
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో గణేష్ మండపాల్లో దాసరి మనోహర్ రెడ్డి పూజలు
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి, కాల్వ శ్రీరాంపూర్ పెగడపల్లి గ్రామాల్లో ప్రతిష్టించిన వినాయక మండపాలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగాల తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని పలువురు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
గణనాథుని కృపాకటాక్షాలతో కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి రైతన్నలు సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.
ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న వినాయక ఉత్సవ కమిటీ సభ్యులను, యువకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మోట్లపల్లి మాజీ సర్పంచ్ గోనే శ్యాం బొమ్మ శ్రీనివాస్ నిదానపురం దేవయ్య అజయ్ తదితరులు ఉన్నారు




