Peddapalli: 23వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల సమ్మె పుట్ట మధు సంఘీభావం!

Peddapalli: పెద్దపల్లిలో 23వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె. మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్.

RAJU, PEDDAPALLI
Published on: 4 Nov 2026 2:26 PM IST
Peddapalli
X

Peddapalli: NHM ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, 23వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె - ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్.

తెలంగాణ వ్యాప్తంగా NHM ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 23వ రోజుకు చేరింది. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం 13-10-2026 నుండి NHM ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారు.

కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడామని, నేడు తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నామని NHM ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సమ్మెకు మద్దతుగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... NHM ఉద్యోగుల సమస్యలు న్యాయమైనవని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వారికి అండగా నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేశారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI