Peddapalli: పెద్దపల్లి లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుపై అవగాహన
Peddapalli: పెద్దపల్లి జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం. ప్రభుత్వ సబ్సిడీలు, మద్దతు ధరల గురించి వివరించిన జిల్లా ఉద్యానవన అధికారి గడ్డం శ్యాంప్రసాద్.
Peddapalli: పెద్దపల్లి లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుపై అవగాహన
పెద్దపెల్లి: రైతులు సాంప్రదాయ పంటల నుంచి లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని పెద్దపల్లి జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో రైతు గోపగోని రంజిత్ అనే రైతు తన రెండు ఎకరాల పొలంలో ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా అధికారి గడ్డం శ్యాంప్రసాద్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ అరెల్లి రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై, పొలంలో మొక్కలు నాటి ఈ సాగును అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యాంప్రసాద్ మాట్లాడుతూ తక్కువ పెట్టుబడి, దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్ పామ్ సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలను సద్వినియోగం చేసుకుని ఇతర రైతులు కూడా ఈ పంట సాగు వైపు అడుగులు వేయాలని కోరారు.
పెద్దపెల్లి జిల్లాలో 4500 ఎకరాలు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 600 పైగా ఎకరాలు రైతులు ఆయిల్ సాగు చేస్తున్నారన్నారు. ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 20 రూపాయలకే మొక్కను అందిస్తుందన్నారు మూడు సంవత్సరాలు ప్రోత్సాహం కింద రైతు అకౌంట్లో 4200 జమ చేస్తున్నారన్నారు. ఆయిల్ ఫామ్ క్వింటాల్ కు 23,700 మద్దతు ధర పలుకుతుందని రైతులు ఆయిల్ పంట సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.




