Manthani: మంథని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు!
Manthani: ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినుల ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
Manthani: మంథని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు!
Manthani:పెద్దపల్లి జిల్లా మంథని లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నూతన విద్యార్థినులకు ఘన స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే వేడుకలను గురువారం ఉత్సాహభరితంగా నిర్వహించారు. విద్యార్థినుల ఆటపాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బాలోజీ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకుని ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. ఇటీవల ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం అందిస్తోందని, త్వరలో మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా అందుబాటులోకి రానుందని తెలిపారు.
అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. పాటలు, నృత్యాలు, ఆటలతో విద్యార్థినులు సందడి చేశారు. కళాశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జాన్సీ, తిరుపతి, రావుల తిరుమల్, శశాంక్, శ్రీదేవి, నగేష్, ఎల్.ఆర్.కే. రెడ్డి, మౌనిక, సబిత, అతిథి అధ్యాపకులు సురేష్, దీపారాణి, సిబ్బంది బియ్యబాని, రాజయ్య, అర్జయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




