Godavarikhani: సింగరేణి కార్మికులను మోసం చేసిన ప్రభుత్వం: ఐఎఫ్‌టీయూ!
Godavarikhani: సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఐఎఫ్‌టీయూ జాతీయ నేతలు మండిపడ్డారు.
Godavarikhani: సింగరేణి కార్మికులను మోసం చేసిన ప్రభుత్వం: ఐఎఫ్‌టీయూ!
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్ టి యు)రాష్ట్ర కమిటీ సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు, సంఘం అధ్యక్షులు ఐ.కృష్ణ అధ్యక్షత ముఖ్య అతిథులుగా ఐ ఎఫ్ టి యు జాతీయ నేతలు టి. శ్రీనివాస్,సాదినేని వెంకటేశ్వ రరావు పాల్గొన్నారు.మాట్లాడుతూ 40 ఇండ్ల క్రితం బిఐఎఫ్ఆర్ లోకి వెళ్లిన సింగరేణిని కార్మికులు అపరిమితంగా శ్రమించి లాభాల బాటలోకి తెచ్చారని ఇందుకుగాను వందల కోట్ల లాభాల నుండి కార్మికులకులాభాలవాటాను బోనస్ గా చెల్లిస్తున్నారని వారు అన్నారు.
గత సంవత్సరం పర్మినెంట్ కార్మికులకు 34%,కాంట్రాక్టు కార్మికులకు 5500 బోనస్ ని ఇచ్చారని 2026 సంవత్సరoలో 40% పర్మినెంట్ కార్మికులకు,10 శాతం కాంట్రాక్టు కార్మికులకు బోనసు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయని రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు కార్మిక సంఘాల డిమాండ్ ను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా నేడు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గత సంవత్సరం బోనస్ ను ఏమాత్రం పెంచకుండా ప్రకటించడం విడ్డూరమైంద ని ఇది సింగరేణి కార్మికులనే కాకుండా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంత ప్రజలందరినీ మోసం చేసినట్లు అవుతుందని వారు అన్నారు.ఈ ద్రోహానికి సింగరేణి ప్రాంతఎమ్మెల్యేలు మంత్రులు,పార్లమెంటు సభ్యులు కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని వారు అన్నారు.
అదేవిధంగా మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజల హక్కు వ్యతిరేక విధానానికి దారి తీస్తున్న, ఓటర్ నివేదిక ఉద్దేశించి మాటలు మాట్లాడుతూ దేశంలో 14కోట్ల మంది, తెలంగాణ రాష్ట్రంలో 93 లక్షల ఓట్లను తొలగించిన ఎస్ఐఆర్ బాగోతాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న ప్పటికీ సిఇసి జ్ఞానేశ్వర్ రాజీనామా రాజీనామా చేయాల్సిన అవసరం ఉండగా ఆయనను కాపాడుతున్న మోడీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి, యువజన,ప్రజా ఉద్యమాల పై మోడీ ప్రభుత్వం సాగిస్తున్న ఫాసిస్టు నిర్బంధాన్ని సాగిస్తున్నాను అని అన్నారు.
బిజెపి సంఘపరివారశక్తుల ఫాసిస్ట్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు ప్రకటించారు.ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి,యువజన,ప్రజా ఉద్యమాలలో కార్మిక వర్గం పాల్గొనాలని,సిఇసి జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో జరుగుతున్న ప్రజా ఉద్యమాల తీవ్రతను గుర్తించి సీఈసీని బర్త్ రఫ్ చేయాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చనిపోయిన వారు మినహా తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని టి.శ్రీనివాస్,సాదినేని డిమాండ్ చేశారు.
సమావేశంలో ఆటో. మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, కాంట్రాక్టు. ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు, షెడ్యూల్ ఎంప్లాయ్ మెంట్ కార్మికులకు నష్టం చేస్తున్న జీవో.6ఉపసంహరించుకోవాలని నెలకు 30 వేల కనీస వేతనం నిర్ణయించాలని డిమాండ్ తో ఆందోళనలు చేయాలని సమావేశం నిర్ణయించింది.
రాష్ట్ర కమిటీ సమావేశoలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్,ఉపాధ్యక్షులు జే. సీతారామయ్య,ఆర్.జనార్ న్,భూమయ్య,శివబాబు, సూర్య శివాజీ,రాసుద్దీన్, సారంగపాణి,నాగయ్య,ఏ. వెంకన్న,ఈ.నరేష్,ఈదునూరి రామకృష్ణ,ఏ.వెంకన్న,డి. బ్రహ్మానందం,చిలుకా శంకర్, ఐ.రాజేశం,టి. శ్రీనివాస్, హెచ్.లింగయ్య భూమేశ్వర్, రామన్న,ఐ.వెంకన్న, డి.ప్రసాద్,శివకుమార్, మేకల రామన్న,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.




